Markapur: మార్కాపురంలో ఈనెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం!
Markapur: మార్కాపురం జిల్లాలో సెప్టెంబర్ 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు.
Markapur: మార్కాపురంలో ఈనెల 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం!
Markapur: మార్కాపురం జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 2,35,409 మంది పిల్లలు, కిశోర బాలబాలికలకు అల్బెండజోల్ మాత్రలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యా సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సెప్టెంబర్ 25న మాత్రలు పంపిణీ చేయాలని, ఆ రోజు తీసుకోలేని వారికి అక్టోబర్ 5న మాప్‌అప్ కార్యక్రమం ద్వారా అందించాలని తెలిపారు. పాఠశాలకు వెళ్లని పిల్లలు, దివ్యాంగులు, భవిత కేంద్రాల్లోని పిల్లలకు సమీప అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మాత్రలు అందించాలని సూచించారు.
మాత్రల పంపిణీ ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది పర్యవేక్షణలోనే జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అల్బెండజోల్ వినియోగంపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితుల కోసం రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.




