Markapuram: మార్కాపురంలో 5కే రెడ్ రిబ్బన్ పరుగు నిర్వహణ!

Markapuram: మార్కాపురంలో హెచ్ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి 5కే రెడ్ రిబ్బన్ పరుగును కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 23 Sept 2026 3:27 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో 5కే రెడ్ రిబ్బన్ పరుగు నిర్వహణ!

Markapuram: మార్కాపురం జిల్లా కేంద్రంలో యువతలో హెచ్ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి 5K రెడ్ రిబ్బన్ పరుగు నిర్వహించారు. UPHC కోర్టు సెంటర్ నుంచి ప్రారంభమైన పరుగు బస్టాండ్ మీదుగా ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వరకు సాగి తిరిగి కోర్టు సెంటర్‌కు చేరుకుంది.

కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగు పందెంలో 123 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి రూ.10 వేలతో ఏ. సాంబశివరావు, ద్వితీయ బహుమతి రూ.7 వేలతో బి. విజయ రాజు నాయక్ నిలిచారు. స్త్రీల విభాగంలో ప్రథమ బహుమతి రూ.10 వేలతో కె. ఈశ్వర వైభవలక్ష్మి, ద్వితీయ బహుమతి రూ.7 వేలతో ఎస్. గాయత్రి సాధించారు.

విజేతలకు జిల్లా కలెక్టర్ నగదు పురస్కారాలు, సర్టిఫికెట్లు అందజేశారు. యువతకు హెచ్ఐవి/ఎయిడ్స్‌పై శాస్త్రీయ అవగాహన కల్పించడం ద్వారా అపోహలను తొలగించవచ్చని జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ కె. రాహుల్ తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని మార్కాపురం ART సెంటర్ వైద్యులు డాక్టర్ సాయి కిరణ్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, దిశా ప్రతినిధులు, CPO, PTలు, ఔట్రీచ్ వర్కర్లు, PEలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM