Mancherial: పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ వి.రాములు

Mancherial: నస్పూర్ తహసీల్దార్ ఆఫీస్‌ను అదనపు కలెక్టర్ వి.రాములు తనిఖీ చేశారు. రెవెన్యూ, భూభారతి పెండింగ్ ఫైళ్లను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 30 Oct 2026 5:16 PM IST
Mancherial
X

Mancherial: పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ వి.రాములు

మంచిర్యాల: ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని, కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ ఫైళ్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నస్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన వివిధ రెవెన్యూ అంశాలకు సంబంధించిన పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. జీఓ నంబర్ 76, 59, ఎస్‌ఐఆర్ ప్రక్రియ, భూభారతి కింద పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, మీ-సేవ ద్వారా జారీ చేయాల్సిన వివిధ ధ్రువపత్రాల దరఖాస్తుల పరిష్కార స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. భూభారతి, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన ఫైళ్లతో పాటు మీ-సేవ ద్వారా జారీ చేయాల్సిన పెండింగ్ ధ్రువపత్రాల దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని తెలిపారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, పెండింగ్ ఫైళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ రోజువారీ పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.