Markapuram: మార్కాపురం జిల్లా నూతన డీఆర్ఓగా శ్రీదేవి బాధ్యతలు!

Markapuram: మార్కాపురం జిల్లా నూతన రెవెన్యూ అధికారిగా ఎం శ్రీదేవి బుధవారం కలెక్టరేట్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Oct 2026 7:37 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జిల్లా నూతన డీఆర్ఓగా శ్రీదేవి బాధ్యతలు!

Markapuram: మార్కాపురం జిల్లా నూతన రెవెన్యూ అధికారిగా (డీఆర్ఓ) ఎం. శ్రీదేవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఏలూరు జిల్లా డీఆర్ఓగా విధులు నిర్వహించిన ఆమె బదిలీపై మార్కాపురం జిల్లాకు వచ్చారు.

ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, పలువురు తహసీల్దారులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను మర్యాదపూర్వకంగా కలిసిన డీఆర్ఓ శ్రీదేవి, జిల్లాలో తన బాధ్యతల స్వీకరణను తెలియజేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM