Malikipuram: మలికిపురంలో వామపక్షాలు, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన!

Malikipuram: కోనసీమ జిల్లా మలికిపురంలో వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.

PRABHU, RAZOLE
Published on: 27 Sept 2026 6:12 PM IST
Malikipuram
X

Malikipuram: మలికిపురంలో వామపక్షాలు, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన!

Malikipuram: ప్రజాస్వామ్య విలువలను, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని వామపక్ష, హక్కుల, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం లోని పూలే– అంబేడ్కర్ భవన్ నుంచి గాంధీ బొమ్మల సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి, అక్కడ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.

‘ఎస్‌ఐఆర్‌’పై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని పునఃపరిశీలించాలని, ఎన్నికల కమిషనర్ ఎంపికలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, ముత్యాల శ్రీనివాస్, సీపీఎం మండల అధ్యక్షులు చేవ్వాకుల సూర్యప్రకాశ్ రావు, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి జిల్లెల్ల మనోహరం,నల్లి ప్రసాద్, మంద సత్యనారాయణ, దీపాటి శివప్రసాద్, ఆకుమర్తి భూషణం, జనిపల్లి సత్యానందం, బడుగు సాయిబాబా, బత్తుల జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE