Amalapuram: కోనసీమ జిల్లాలో 12 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్సులు!

Amalapuram: కోనసీమ జిల్లాలో 12 ఓపెన్ కేటగిరీ A4 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అబ్కారీ శాఖ తెలిపింది. అక్టోబర్ 5న లాటరీ నిర్వహణ.

SURESH, AMALAPURAM
Published on: 27 Sept 2026 4:44 PM IST
Amalapuram
X

Amalapuram: కోనసీమ జిల్లాలో 12 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్సులు!

Amalapuram: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 2026-27 ఎక్సైజ్ పాలసీలో భాగంగా డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12 ఓపెన్ కేటగిరీ A4 మద్యం దుకాణాలకు లైసెన్సుల కేటాయింపు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మద్యనిషేధ,అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. లాటరీ విధానంలో లైసెన్సుల కేటాయింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉండే ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలోని అమలాపురం రూరల్,కొత్తపేట, రాజోలు,రామచంద్రపురం రూరల్ మండలాలతో పాటు రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో ఈ దుకాణాలను కేటాయించనున్నారు.21 ఏళ్లు నిండిన వారు అర్హులు A4 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.నిబంధనల ప్రకారం అనర్హతకు గురికాని వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్‌ రిఫండబుల్ దరఖాస్తు రుసుముతో పాటు రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు కలిపి మొత్తం రూ.3,01,000 చెల్లించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

అభ్యర్థులు ఆన్‌లైన్, హైబ్రిడ్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు [https://oc.hpfsproject.com](https://oc.hpfsproject.com) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటలకు ముగుస్తుంది.

అక్టోబర్ 5న లాటరీ అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన,లాటరీ నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టనున్నారు.అక్టోబర్ 5వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి,ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు సమాచారం అందజేయనున్నారు.ఒక దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు అందినప్పుడే లాటరీ నిర్వహిస్తారు.నాలుగు దరఖాస్తులు అందకపోతే గడువు పొడిగించే అవకాశం ఉంటుంది.పొడిగించిన గడువు అనంతరం కూడా నాలుగు దరఖాస్తులు అందకపోతే ఎంపిక ప్రక్రియ నిర్వహించరు. నిబంధనల ప్రకారం దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లిస్తారు.

దుకాణాల వారీగా వార్షిక ఫీజులు అమలాపురం రూరల్, కొత్తపేట,రాజోలు, రామచంద్రపురం రూరల్ మండలాల పరిధిలోని ఒక్కో దుకాణానికి వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (RET) రూ.71.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.50 లక్షలుగా నిర్ణయించారు.

రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని ఐదు దుకాణాలకు వార్షిక RET రూ.60.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయించారు.లాటరీలో ఎంపికైన అభ్యర్థులు చట్టపరమైన నిబంధనలు పూర్తి చేసి Form-A4 లైసెన్స్‌తో పాటు పర్మిట్ రూమ్ లైసెన్స్ పొందాలి. వార్షిక RETను ఒకేసారి లేదా నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంది.ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక గెజిట్‌లో పేర్కొన్న అర్హతలు, షరతులను పరిశీలించి నిర్ణీత గడువులో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా మద్యనిషేధ,అబ్కారీ శాఖ అధికారులు సూచించారు. జిల్లా మద్యనిషేధ మరియు అబ్కారీ అధికారి, అమలాపురం,డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM