Komarolu: కొమరోలు మండలంలో 'ఇంటింటికి కామూరి కుటుంబం' కార్యక్రమం!

Komarolu: మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో కామూరి రమణారెడ్డి ఇంటంటికి కామూరి కుటుంబం కార్యక్రమం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 21 Sept 2026 5:23 PM IST
Komarolu
X

Komarolu: కొమరోలు మండలంలో 'ఇంటింటికి కామూరి కుటుంబం' కార్యక్రమం!

Komarolu: మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఇంటింటికి కామూరి కుటుంబం కార్యక్రమాన్ని కామూరి రమణారెడ్డి ఈ రోజు బాదినేని పల్లె, సూరేపల్లి, పంచాయతీలలో నిర్వహించారు . ప్రతి గ్రామంలో కార్యకర్తలు కామూరి కుటుంబానికి గజమాలలతో ఘన స్వాగతం పలికారు.

మా కుటుంబన్నీ పది సంవత్సరాలుగా ఆదరించిన మండలంలోని ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ 2029 లో జగనన్నను ముఖ్యమంత్రిగా గెలుచుకోవాలని ప్రజలను కోరుతూ గ్రామాలలో ప్రతి వీధి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

అక్టోబర్ నెలలో 5 వ తేదీన అనాథలకు, కదలలేని పరిస్థితిలో ఎవరు లేనివారికి రెండు పూటల ఉచితంగా భోజనం అందించేందుకు శుభోజనం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నా మని ప్రజలు కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU