జోగి మేఘన కారు ప్రమాదంపై సంచలన అనుమానాలు.. మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉందంటూ తండ్రి ఫిర్యాదు!
Jogi Meghana Car Accident: జోగి మేఘనకు జరిగిన కారు ప్రమాదంపై ఆమె తండ్రి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జోగి మేఘన కారు ప్రమాదంపై సంచలన అనుమానాలు.. మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉందంటూ తండ్రి ఫిర్యాదు!
Jogi Meghana Car Accident: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘనకు ఇటీవల జరిగిన కారు ప్రమాదంపై ఆమె తండ్రి కృష్ణ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉండి ఉండొచ్చంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేయడం తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 15వ తేదీన జోగి రమేష్ కోడలు మేఘన, ఆమె తండ్రి కృష్ణ విజయవాడ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వారి కారును వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు కొంత భాగం దెబ్బతిన్నది. దీనిపై బస్సు డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, తమకు ప్రాణహాని ఉన్నందున సమగ్ర విచారణ జరపాలని కోరుతూ మేఘన తండ్రి కృష్ణ ఈ నెల 16న ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అప్పుడే కేసు నమోదు చేశారు.
గతంలోనే జోగి మేఘన తన మామ జోగి రమేష్, భర్త రాజీవ్ మరియు మరికొంత మంది కుటుంబ సభ్యులపై హత్యాయత్నం మరియు వరకట్న వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేయడం తెలిసిందే. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆమె మూడు నెలల కిందట ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆశ్రయించగా అప్పట్లోనే కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కారు ప్రమాద ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని, దీని వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉండొచ్చని మేఘన తండ్రి పోలీసుల ఎదుట అనుమానం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. అయితే, ఇది కేవలం సాధారణ రోడ్డు ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకం కాదని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.




