JC Prabhakar Reddy: "వైఎస్సార్ పేరును జగన్ నాశనం చేశారు!".. వైసీపీపై జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన కామెంట్స్!

JC Prabhakar Reddy: వైసీపీ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు.

Arun Chilukuri
Published on: 10 Nov 2026 3:00 PM IST
JC Prabhakar Reddy
X

JC Prabhakar Reddy: "వైఎస్సార్ పేరును జగన్ నాశనం చేశారు!".. వైసీపీపై జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన కామెంట్స్!

JC Prabhakar Reddy: గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పట్లో తమిళనాడు నుంచి దొంగ ఓటర్లను తీసుకువచ్చి కుప్పంలో వైసీపీ గెలిచిందని, ఇప్పుడు నీతులు మాట్లాడుతున్న వైసీపీ నేతలకు అప్పట్లో ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తే ప్రజలే ఆయనకు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

"వైసీపీ హయాంలో జరిగిన దౌర్జన్యాలు చూసి అప్పట్లో మమ్మల్ని పోటీ చేయొద్దని చంద్రబాబు చెప్పారు. అయినా అవన్నీ తట్టుకుని నిలబడి నేను పోటీ చేశాను. శింగనమల నియోజకవర్గంలో రెండు జడ్పీటీసీ స్థానాలు వైకాపాకు ఎలా వచ్చాయో ఆ పార్టీ నేత శైలజానాథ్‌ చెప్పాలి. మళ్లీ అధికారంలోకి వస్తే రప్పారప్పా నరికేస్తాం అంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెచ్చుకున్న మంచి పేరును జగన్ పూర్తిగా చెడగొట్టారు. జిల్లాలో ఫ్యాక్షన్‌ను శాశ్వతంగా రూపుమాపాలని నేను భావిస్తున్నా. 2021లో వైసీపీ పాలనలో పోలీసులు ప్రవర్తించినట్లుగా ఇవాళ ప్రవర్తించి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. ఇక అనంతపురం నగరం వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత మేయర్‌గా ఉన్న రమేశ్‌గౌడ్‌ పార్టీ మారితే బాగుంటుంది" అని జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.