Markapur: మార్కాపురం ఎస్పీని కలిసిన జనసేన నాయకులు!
Markapur: మార్కాపురం జిల్లా నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనాను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలోని శాంతిభద్రతలు మరియు పలు ప్రజా సమస్యలపై చర్చించారు.
Markapur: మార్కాపురం ఎస్పీని కలిసిన జనసేన నాయకులు!
Markapur: మార్కాపురం జిల్లా నూతన ఎస్పీ పంకజ్‌కుమార్ మీనాను జిల్లా జనసేన పార్టీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా జనసేన నాయకుడు ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మార్కాపురం ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ పాత్ర వంటి అంశాలపై ఎస్పీతో చర్చించినట్లు ఇమ్మడి కాశీనాథ్ తెలిపారు.
జిల్లాలో ప్రజలకు భద్రతాభావం కల్పించడంతో పాటు, పోలీసు సేవలు మరింత చేరువ కావాలని ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు విజయరావు నరసింహారావు, సిరిగిరి శ్రీనివాసరావు, ఉమ్మడి రవీంద్ర, పిన్నబోయిన శ్రీనివాసులు, కంభం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.




