Chintoor: చింతూరులో జనసేన ప్రచారం జోరు గెలుపే లక్ష్యంగా గాజు గ్లాస్ హోరు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలంలో జనసేన ప్రచారం జోరుగా సాగుతోంది. జెడ్పీటీసీ అభ్యర్థి తీగల కవిత, ఎంపీటీసీ అభ్యర్థుల విజయానికి బేడే సతీష్ నేతృత్వంలో ఇంటింటా ప్రచారం.
Chintoor: చింతూరులో జనసేన ప్రచారం జోరు గెలుపే లక్ష్యంగా గాజు గ్లాస్ హోరు!
Chintoor: చింతూరు మండలంలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. మండలంలోని తుమ్మల, చిడుమూరు, చింతూరు-2 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల విజయం కోసం పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.
అలాగే చింతూరు జెడ్పీటీసీ స్థానంలో పోటీలో ఉన్న జనసేన అభ్యర్థి తీగల కవిత గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జనసేన కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ బేడే సతీష్ సారధ్యంలో నాయకులు,కార్యకర్తలు ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.




