AP Local Elections: కడప, పులివెందులలో ఉద్రిక్తత .. పోలింగ్ కేంద్రాల్లో రచ్చ!
AP Local Elections: కడప, పులివెందుల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
AP Local Elections: కడప, పులివెందులలో ఉద్రిక్తత .. పోలింగ్ కేంద్రాల్లో రచ్చ!
Pulivendula Election: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ పండుగ ఉత్సాహంగా సాగుతుండగా.. రాయలసీమ రాజకీయాల గడ్డ కడప, పులివెందుల నియోజకవర్గాల్లో మాత్రం ఒక్కసారిగా రాజకీయం సంచలనంగా మారింది. ఓటింగ్ వేళ ప్రధాన పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద వాతావరణం వేడెక్కింది.
పోలింగ్ కేంద్రాల్లోకి తమను అనుమతించడం లేదంటూ వైఎస్సార్సీపీ ఏజెంట్లు ఆందోళనకు దిగడంతో రగడ మొదలైంది. తమ బాధ్యతలు నిర్వహించకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని, తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తమ చొక్కాలు చించివేసి, మొబైల్ ఫోన్లు పగలగొట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో పోలింగ్ బూత్‌ల వద్ద ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి. వైసీపీ, టీడీపీ ఏజెంట్లతో వరుసగా చర్చలు జరిపాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించాయి. పోలీసుల కఠిన వైఖరితో ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గడంతో పరిస్థితి శాంతించింది.
ఉద్రిక్తతల నడుమ కూడా రెండు చోట్లా ఓటింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జనం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే క్యూ లైన్లలో ఓపికగా వేచి ఉన్నారు. ఓటర్ కార్డు లేనివారు ఎన్నికల కమిషన్ సూచించిన 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించి లోపలికి వెళ్తున్నారు.
పోలింగ్ బూత్‌ల లోపలికి మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువెళ్లేందుకు అధికారులు కఠినంగా నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం కడప, పులివెందుల కేంద్రాల్లో భారీ పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ శాంతియుతంగా జరుగుతోంది.




