Chinturu: చింతూరు ఏజెన్సీలో కుండపోత వర్షం జలమయమైన రహదారులు!
Chinturu: చింతూరు ఏజెన్సీలో కుండపోత వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండటంతో రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Chinturu: చింతూరు ఏజెన్సీలో కుండపోత వర్షం జలమయమైన రహదారులు!
Chinturu: చింతూరు ఏజెన్సీలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం పడుతుంది.ఏజెన్సీలోని పలు వాగులలో భారీగా నీరు చేరి ఉప్పొంగి ప్రవహిస్తూ రహదారుల పై ఎక్కి పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.వి ఆర్ పురం మండలంలో అన్నవరం వాగు ఉగ్రరూపం దాల్చి రహదారి పైకి ఎక్కి ప్రవహిస్తుంది.దీంతో విఆర్ పురం నుండి చింతూరు వైపుకు రాకపోకలు నిలిచిపోయాయి.
కూనవరం మండలంలోని కొండ్రాజుపేట వద్ద రహదారి పైకి నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో చింతూరు ఏజెన్సీలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జలమయమైన రహదారుల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పనులు ఉంటేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. భారీ వర్షాల వలన ఏదైనా ప్రమాదం సంభవిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పోలీసు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా గోదావరి శబరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తాయని కావున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా మెలగాలని సూచించారు.




