Guntur Municipal Election Results: గుంటూరులో టీడీపీ సునామీ.. 85 వేల భారీ ఆధిక్యంలో మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ..

Guntur Municipal Election Results: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో తెదేపా ప్రభంజనం. 85 వేల ఓట్ల భారీ ఆధిక్యంలో మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, సంబరాల్లో శ్రేణులు.

Arun Chilukuri
Published on: 3 Nov 2026 5:13 PM IST
Guntur Municipal Election Results
X

Guntur Municipal Election Results: గుంటూరులో టీడీపీ సునామీ.. 85 వేల భారీ ఆధిక్యంలో మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ.. 

Guntur Municipal Election Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (GMC) ఎన్నికల ఫలితాల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. మొదటి రౌండ్ నుంచే ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కూటమి అభ్యర్థులు ఓట్ల వర్షంతో విరుచుకుపడ్డారు. ఈ ఫలితాల్లో టీడీపీ మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ తన సమీప వైసీపీ అభ్యర్థిపై ఏకంగా 85 వేల పైచిలుకు ఓట్ల చారిత్రాత్మక భారీ ఆధిక్యంలో దూసుకెళ్తూ విజయం వైపు పయనిస్తున్నారు.

లక్ష్మీ అపర్ణ విజయం దాదాపు ఖాయం కావడంతో గుంటూరు నగరంలో టీడీపీ శ్రేణులు పటాకులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 76 డివిజన్లకు గానూ అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా చివరి దశకు చేరుకుంటుండగా, వైసీపీ కోటలను బద్దలు కొడుతూ కూటమి డివిజన్లను కైవసం చేసుకుంది.

క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, గుంటూరు నగర అభివృద్ధిపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ చారిత్రాత్మక విజయానికి కారణమని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ స్థానాలతో పాటు మేయర్ పీఠాన్ని భారీ మెజారిటీతో దక్కించుకోవడంతో గుంటూరు కార్పొరేషన్‌పై కూటమి జెండా అధికారికంగా ఎగరనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.