Giddalur: గిద్దలూరులో మురుగు కాలువల ప్రత్యేక శుభ్రత!

Giddalur: గిద్దలూరు పట్టణంలో మురుగు కాలువల పరిశుభ్రత కోసం 20 మంది అదనపు కార్మికులను నియమించి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆదేశించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 7 Oct 2026 3:18 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో మురుగు కాలువల ప్రత్యేక శుభ్రత!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మురుగు కాలువలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని మురుగు కాలువల శుభ్రత కోసం దినసరి వేతన ప్రాతిపదికన 20 మంది అదనపు పారిశుధ్య కార్మికులను నియమించారు.

పట్టణంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను తొలగించి నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని, పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని వాటర్ బోర్డు కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజల ఆరోగ్యం, పారిశుధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులతో విధుల్లో దగ్గరుండి మురుగు కాలువలను శుబ్రం చేయిస్తున్న నాయకులు

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాహాన్ షా వలి,నంది శ్రీనివాసులు, దుత్తా బాల ఈశ్వరయ్య, లొక్కు రమేష్, మండ్ల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU