Markapur: మార్కాపురంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!

Markapur: మార్కాపురం గాంధీ పార్కులో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు నివాళులర్పించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 2 Oct 2026 10:08 AM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!

Markapur: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న గాంధీ పార్కులో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతాలు, సత్యనిష్ఠ ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాల్లో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, తహసీల్దార్ చిరంజీవి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు, జనసేన నాయకుడు రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM