Markapur: పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!
Markapur: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఎస్సై నాగరాజు నివాళులర్పించారు.
Markapur: పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!
Markapur: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై జి. నాగరాజు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న నిర్వహించుకుంటున్నామని తెలిపారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను గాంధీజీ తన జీవితంలో ఆచరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పోషించిన పాత్ర, దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన విధానం చిరస్మరణీయమన్నారు.
గాంధీజీ ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని సత్యం, అహింస, శాంతి మార్గాల్లో పయనించాలని సూచించారు. సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఎస్సై నాగరాజు కోరారు. అనంతరం పోలీస్ సిబ్బంది గాంధీజీకి నివాళులర్పించారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.




