Markapuram: మార్కాపురంలో సీనియర్ సివిల్ జడ్జి నివాస భవనానికి శంకుస్థాపన!

Markapuram: మార్కాపురంలో సీనియర్ సివిల్ జడ్జి నివాస భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఆలపాటి గిరిధర్, వై. లక్ష్మణరావు శంకుస్థాపన చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 27 Sept 2026 1:07 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో సీనియర్ సివిల్ జడ్జి నివాస భవనానికి శంకుస్థాపన!

Markapuram: మార్కాపురం జిల్లా కేంద్రంలో న్యాయశాఖ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి నివాస భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆరవ అదనపు న్యాయస్థానం ప్రాంగణంలో హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఆలపాటి గిరిధర్, వై. లక్ష్మణరావు భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సత్యానంద్, ఆరవ అదనపు జిల్లా జడ్జి దుర్గాభవాని, పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

అనంతరం కోర్టు హాల్లో జిల్లాలోని వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులతో హైకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా మర్యాదపూర్వకంగా కలిశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM