Vijaysai Reddy: ఉత్తరాంధ్ర అభివృద్ధికి 5 సూత్రాలు ప్రకటించిన విజయసాయి రెడ్డి.. రాజధాని అంశంపై వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్!

Vijaysai Reddy: మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ విశేషాలు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం 5 సూత్రాల ప్రకటనతో పాటు వైసిపి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు.

Arun Chilukuri
Updated on: 30 Sept 2026 1:20 PM IST
Vijaysai Reddy
X

Vijaysai Reddy: ఉత్తరాంధ్ర అభివృద్ధికి 5 సూత్రాలు ప్రకటించిన విజయసాయి రెడ్డి.. రాజధాని అంశంపై వైసీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్!

Vijaysai Reddy: మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి 5 కీలక సూత్రాలను ప్రకటించారు. ఈ సందర్భంగా గత వైసిపి ప్రభుత్వం అనుసరించిన విధానాలపై, రాజధాని అంశంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయసాయి రెడ్డి ప్రకటించిన 5 సూత్రాలు:

ఉత్తరాంధ్ర రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ: ఉత్తరాంధ్ర ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసి, ప్రతి ఏటా బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.

తాగునీటి సమస్య పరిష్కారం: ఉద్ధానం ప్రాంతంలో ప్రధాన సమస్య అయిన తాగునీటి కొరతను తీర్చడంతో పాటు, నదుల అనుసంధానం మరియు ఆక్రమణల తొలగింపు ద్వారా ఉత్తరాంధ్ర నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.

జీవన ప్రమాణాల పెంపు: ఉత్తరాంధ్రలోని సుమారు 2 వేల గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా చర్యలుంటాయని తెలిపారు.

వలసల నివారణ - పారిశ్రామిక అభివృద్ధి: ప్రాంతంలో వలసలను పూర్తిగా నివారించి, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

5వ షెడ్యూల్ అమలు: రాజ్యాంగంలో పొందుపరిచిన 5వ షెడ్యూల్‌ను అమలు చేయడంతో పాటు, జీవో నంబర్ 3కి చట్టబద్ధత కల్పిస్తామని.. ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. గిరిజనుల నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని, అరకు ప్రాంతంలో మత మార్పిడి విధానాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖను మూడు రాజధానులు అని చెప్పి వైసిపి మాట తప్పిందని, "మావిగన్ లేదు మాయా గన్ లేదు" రాజధాని అంశంపై వైసీపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఉత్తరాంధ్ర గురించి చెప్పిన అంశాలను బయటపెట్టాలని కోరారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విశాఖ మినహాయిస్తే ఉత్తరాంధ్ర ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉందని, ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఏపీకి దమ్మున్న సీఎం రావాలని వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.