Vijaysai Reddy: కొత్త పార్టీ పేరును ప్రకటించిన విజయసాయిరెడ్డి
Vijaysai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.
Vijaysai Reddy: కొత్త పార్టీ పేరును ప్రకటించిన విజయసాయిరెడ్డి
Vijaysai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సొంతంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన నూతన పార్టీ పేరును ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) గా ఆయన అధికారికంగా ప్రకటించారు.
విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరుతో పాటు, పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ మార్పులకు, పారదర్శక పాలనకు తమ 'పరివర్తన రాజనీతి పార్టీ' శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామని, త్వరలోనే పార్టీ కార్యచరణను వెల్లడిస్తామని వివరించారు.




