Chintoor: చింతూరులో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు మార్కెట్‌లో మాజీ ఎమ్మెల్యే ఓట్ల వేట!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు ప్రధాన సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 30 Oct 2026 1:21 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు మార్కెట్‌లో మాజీ ఎమ్మెల్యే ఓట్ల వేట!

Chintoor: చింతూరులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చింతూరు ప్రధాన సెంటర్ లోని కూరగాయల దుకాణాలు, వ్యాపారస్తులను రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కలిశారు.చింతూరు ఎంపీటీసీ అభ్యర్థి సోడే కళ్యాణి,జడ్పీటీసీ అభ్యర్థి సవలం అమల తరపున ఆమె ప్రచారం నిర్వహించారు.

మార్కెట్ లోని మహిళా వ్యాపారులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామలింగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ (చిన్ని ), శ్రీలత రెడ్డి, కళ్యాణి, సంధ్యారాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR