YS Jagan: రిటైర్డ్ అయినా ఈడ్చుకొస్తా.. వడ్డీతో సహా చెల్లిస్తా: పోలీసులకు వైఎస్ జగన్ తీవ్ర హెచ్చరిక!

YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. పోలీసులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, కార్యకర్తలకు కొండంత అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 27 Oct 2026 5:07 PM IST
YS Jagan: రిటైర్డ్ అయినా ఈడ్చుకొస్తా.. వడ్డీతో సహా చెల్లిస్తా: పోలీసులకు వైఎస్ జగన్ తీవ్ర హెచ్చరిక!
X

YS Jagan: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో స్థానిక ఎన్నికల ప్రచార వేదికగా ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగంపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు తానున్నాననే ధైర్యాన్ని ఇస్తూ, అక్రమ కేసులు, వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

"పోలీసులు తమ టోపీపై ఉన్న మూడు సింహాలను చూసి డ్యూటీ చేయాలి. మీరు ఉద్యోగం చేసేది చంద్రబాబు కోసం కాదు.. చట్టం కోసం. మా సమయం వచ్చినప్పుడు కచ్చితంగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. రిటైర్ అయి ఎక్కడ దాక్కున్నా ఈడ్చుకొచ్చి మరీ చర్యలు తీసుకుంటాం" అని జగన్ హెచ్చరించారు.

"మీ మీద పడ్డ దెబ్బను మీ అన్న చూస్తూ ఊరుకోడు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా భయపడేది లేదు. జగన్ 2.0లో మొదటివాడు జగన్ అయితే.. రెండో స్థానం కార్యకర్తదే. మీరు తోడుగా నిలబడ్డారు కాబట్టే నేను సీఎం అయ్యాను" అని స్పష్టం చేశారు.

"రక్షకులుగా ఉండాల్సిన వారే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మన హక్కులను మనమే కాపాడుకోవాలి. పులివెందులలో కొడితే ఆ సౌండ్ రాష్ట్రం మొత్తం వినిపించాలి.. మోగాలి!" అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మున్సిపల్ ఎన్నికల రోజు స్వయంగా ఓటు వేసేందుకు పులివెందులకు వస్తున్నట్లు వెల్లడించిన జగన్.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.