Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంవో పేరుతో నకిలీ వాట్సప్ ఛానల్.. పవన్ కళ్యాణ్ ఆఫీస్ సీరియస్ వార్నింగ్!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం పేరుతో నకిలీ వాట్సప్ ఛానల్ ప్రత్యక్షమైంది. ఆ ఛానల్‌తో తమకు సం
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంవో పేరుతో నకిలీ వాట్సప్ ఛానల్.. పవన్ కళ్యాణ్ ఆఫీస్ సీరియస్ వార్నింగ్!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం పేరుతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ వాట్సప్ ఛానల్‌ను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ‘డిప్యూటీ సీఎంవో, ఆంధ్రప్రదేశ్’ పేరుతో చెలామణి అవుతున్న ఆ ఛానల్‌కు, తమ అధికారిక కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఉప ముఖ్యమంత్రి కార్యాలయ గుర్తింపును దుర్వినియోగం చేస్తూ ఈ నకిలీ వాట్సప్ ఛానల్ ద్వారా తప్పుడు సమాచారాన్ని, ప్రభుత్వం మరియు కార్యాలయంతో సంబంధం లేని కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జరుగుతున్న ఇటువంటి కుట్రలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలను ఏమాత్రం సహించేది లేదని, ఈ నకిలీ ఛానల్ వెనుక ఉన్న బాధ్యులపై సైబర్ క్రైమ్ మరియు చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నకిలీ వాట్సప్ ఛానల్‌ను ఎవరూ నమ్మవద్దని, అందులో వచ్చే సమాచారాన్ని అనుసరించడం కానీ, ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కానీ చేయవద్దని డిప్యూటీ సీఎంవో పౌరులకు సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి నకిలీ సర్క్యులేషన్లపై ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది.




