Kothapeta: ర్యాలీలో రూ.3.20 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం!
Kothapeta: కొత్తపేటలో కూటమి ప్రభుత్వ హయాంలో రూ. 3.20 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Kothapeta: ర్యాలీలో రూ.3.20 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం!
Kothapeta: కూటమి ప్రభుత్వంలో ప్రగతి బాట పట్టిన గ్రామాలు. రూ.3.20 కోట్లతో ర్యాలీ గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. రూ.1.25 కోట్లతో సాస్కి నిధులతో రెండు రహదారులు నిర్మాణానికి శంకుస్థాపన. రూ.1.50 కోట్ల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రహదారుల ప్రారంభం. రూ.45.50 లక్షలు జలజీవన్ మిషన్ నిధులతో తలపెట్టిన మైక్రో ఫిల్టర్ సంపు నిర్మాణానికి భూమి పూజ.
పల్లెల అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని,ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తూ గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం ర్యాలి గ్రామంలో ర్యాలి బ్రిడ్జి నుంచి బుల్లెయ్య రేవు వరకు రూ.75 లక్షలతో రహదారి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ర్యాలి ఆర్ అండ్ బి రోడ్డు నుంచి మాధవరావుపేటకు మీదుగా ఆర్ అండ్ బి రోడ్డు వరకు రూ.50 లక్షలతో చేపట్టనున్న రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం రూ.45.50 లక్షలు జలజీవన్ మిషన్ నిధులతో తలపెట్టిన మైక్రో ఫిల్టర్ సంపు నిర్మాణానికి భూమి పూజ చేశారు. తదుపరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.1.50 కోట్లతో నిర్మించిన పలు రహదారులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలి గ్రామంలో సుమారు రూ.3.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.పల్లెల్లో రహదారులు, డ్రైనేజీలు,తాగునీరు,విద్యుత్ తదితర మౌలిక వసతులను అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.




