Arnab Cyclone: ఏపీపై విరుచుకుపడుతున్న 'అర్నాబ్' తుఫాను..అల్లకల్లోలంగా కోస్తా తీరం!
Arnab Cyclone: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది.
Arnab Cyclone: ఏపీపై విరుచుకుపడుతున్న 'అర్నాబ్' తుఫాను..అల్లకల్లోలంగా కోస్తా తీరం!
Yanam Cyclone: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఉగ్రరూపం దాలుస్తూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య బాపట్ల, విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో ఈ తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంది.
తుఫాను ఔటర్ స్పైరల్ బ్యాండ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకడంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 125 నుండి 135 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగానికి చేరే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. రాకాసి అలలు ఎగిసిపడుతుండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
తుఫాను ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు యంత్రాంగాన్ని సంపూర్ణంగా అప్రమత్తం చేశాయి. ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇరు రాష్ట్రాల్లో కలిపి సుమారు 4,000 సైక్లోన్ షెల్టర్లను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంత గ్రామాల్లో ఉన్న వేలాది మంది ప్రజలను అధికారులు శరవేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలో దాదాపు 50కి పైగా రైళ్లను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం, భారీ వర్ష సూచన దృష్ట్యా ఉభయ రాష్ట్రాల్లోని పలు ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, స్థానిక అధికారుల హెచ్చరికలను పాటించాలని ప్రభుత్వం కోరింది.




