Amalapuram: పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ప్రజల ఫీడ్‌బ్యాక్‌కు ప్రాధాన్యం!
Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పీజీఆర్ఎస్ సేవలను మరింత పారదర్శకంగా మార్చేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని తెచ్చినట్లు కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
Amalapuram: పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ప్రజల ఫీడ్‌బ్యాక్‌కు ప్రాధాన్యం!
Amalapuram: ప్రజల అభిప్రాయాలతో మరింత మెరుగైన పాలనకు అవకాశం ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు, వారికి అందుతున్న ప్రభుత్వ సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని పరిపాలనా వ్యవస్థను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.సోమవారం (సెప్టెంబర్ 28) జిల్లావ్యాప్తంగా పీజీఆర్ఎస్ (రెవెన్యూ క్లినిక్) కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రజలకు అందుతున్న సేవలపై వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లాలోని అన్ని పీజీఆర్ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.పీజీఆర్ఎస్ కేంద్రాల్లో సేవలు పొందిన అనంతరం ప్రజలు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి,సేవలపై తమ అభిప్రాయాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రజల నుంచి అందే అభిప్రాయాల ఆధారంగా సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత,జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు,మండల తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, గ్రామ,వార్డు సచివాలయాల్లో పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరించనున్నట్లు తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పీజీఆర్ఎస్ కేంద్రాలకు స్వయంగా వచ్చి ఫిర్యాదులు సమర్పించడం సాధ్యం కాని వారు 1100 టోల్‌ఫ్రీ నంబర్, మీకోసం వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా 300కు పైగా పౌర సేవలను పొందవచ్చని వెల్లడించారు.ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు వారి అభిప్రాయాలను కూడా పాలనలో భాగస్వామ్యం చేయడం ద్వారా మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన ప్రజా సేవలను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.




