Chandrababu: బిల్ గేట్స్‌ను ఒప్పించి హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తెచ్చా.. సీఐఐ సదస్సులో నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
Chandrababu: విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పాత జ్ఞాపకాలను, పాలనా అనుభవాలను పంచుకున్నారు.
Chandrababu: బిల్ గేట్స్‌ను ఒప్పించి హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తెచ్చా.. సీఐఐ సదస్సులో నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
Chandrababu: విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పాత జ్ఞాపకాలను, పాలనా అనుభవాలను పంచుకున్నారు. సదస్సులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ పాల్కీ శర్మ నిర్వహించిన 'ఫైర్ సైడ్ చాట్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ముఖ్యంగా ఐటీ రంగ అభివృద్ధి వెనుక ఉన్న తన దార్శనికత గురించి చంద్రబాబు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బిల్ గేట్స్‌ను ఎలా ఒప్పించానంటే..
భవిష్యత్తు అంతా ఐటీ రంగానిదేనని తాను ఆనాడే ఊహించి, దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌ను కలిసి, హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేలా ఒప్పించిన విధానాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. భారతదేశంలో గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇది ఐటీ రంగ విస్తరణకు ఎంతగానో దోహదపడుతుందని తాను బిల్ గేట్స్‌కు వివరించినట్లు చెప్పారు.
ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యుత్ సంస్కరణలపై..
ఐటీ పరిశ్రమకు అవసరమైన సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దేందుకే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, తాను ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇస్తుంటే, నాటి ప్రతిపక్షాలు తనను తీవ్రంగా విమర్శించేవని అన్నారు. కేవలం ఐటీ రంగమే కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు కూడా తానే తీసుకొచ్చానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.




