CII Partnership Summit 2026: "విశాఖ సీఐఐ సదస్సులో ఆసక్తికర దృశ్యం!".. పీయూష్ గోయల్‌తో కలిసి డోలు వాయించిన చంద్రబాబు, పవన్!
CII Partnership Summit 2026: విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది.
CII Partnership Summit 2026: "విశాఖ సీఐఐ సదస్సులో ఆసక్తికర దృశ్యం!".. పీయూష్ గోయల్‌తో కలిసి డోలు వాయించిన చంద్రబాబు, పవన్!
CII Partnership Summit 2026: విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సాదర స్వాగతం పలికారు.
సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాంగణమంతా కలియతిరిగారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన వివిధ సంప్రదాయ కళాబృందాల ప్రదర్శనలను వారు ఆసక్తిగా తిలకించారు. కళాకారులను ప్రోత్సహిస్తూ పీయూష్ గోయల్‌తో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వయంగా డోలు వాయించి అక్కడున్న వారిలో ఉత్సాహం నింపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.




