Chandrababu: ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం: పాన్ ఐఐటీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు సందడి!

Chandrababu: టెక్నాలజీ ఆవిష్కరణలకు ఏపీని హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న పాన్ ఐఐటీ సమ్మిట్‌లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను పరిశీలించిన చంద్రబాబు.

Arun Chilukuri
Published on: 3 Oct 2026 4:43 PM IST
Chandrababu
X

Chandrababu: ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం: పాన్ ఐఐటీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు సందడి!

Chandrababu: టెక్నాలజీ ఆవిష్కరణలు మరియు స్టార్టప్‌లకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర స్థానంగా (హబ్) మార్చే దిశగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం కళావేదికలో ఘనంగా జరుగుతున్న పాన్ ఐఐటీ సమ్మిట్ లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని, అక్కడ ప్రదర్శించిన నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ ప్రాజెక్ట్ స్టాల్స్‌ను పరిశీలించారు.

ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన అత్యాధునిక డ్రోన్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు.. సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు దానిపై తన సంతకం చేసి వారిని ప్రోత్సహించారు.

పెట్రోల్‌‌తో నడిచే ద్విచక్ర వాహనాలను కేవలం గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా (EVs) మార్చే సరికొత్త సాంకేతికతపై ఆరా తీశారు. ఈ అద్భుతమైన ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కేవలం ముఖాన్ని స్కాన్ చేసి నిమిషాల వ్యవధిలో ప్రాథమిక ఆరోగ్య నివేదికను అందించే సరికొత్త హెల్త్ యాప్ పనితీరును సీఎం స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

'స్వర్ణాంధ్ర-10 సూత్రాల' అమలులో టెక్నాలజీ వినియోగం ఏవిధంగా ఉండాలనే అంశంపై చిన్నారులు ఇచ్చిన అద్భుతమైన ప్రజెంటేషన్‌ను సీఎం చంద్రబాబు ఎంతో ఆసక్తిగా ఆలకించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి, వారితో కలిసి ఆప్యాయంగా గ్రూప్ ఫోటో దిగారు.

యువత మరియు టెక్ నిపుణుల నూతన ఆలోచనలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.