Chandrababu: రెబల్స్‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్.. పోటీలో ఉంటే పార్టీ నుంచి సస్పెన్షన్ తప్పదు!
Chandrababu: ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రెబల్స్‌గా పోటీ చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
Chandrababu: రెబల్స్‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్.. పోటీలో ఉంటే పార్టీ నుంచి సస్పెన్షన్ తప్పదు!
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు, శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెబల్‌గా పోటీలో ఉండే అభ్యర్థులపై వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. స్థానిక ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక మరియు కూటమి సమన్వయంపై ఆయన పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికల బరిలో ఉన్న రెబల్ అభ్యర్థులను ఒప్పించి నామినేషన్లను ఉపసంహరింపజేయాలని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో కూడా టీడీపీ రెబల్స్ లేకుండా చూడాలని స్పష్టం చేశారు. మిత్రధర్మాన్ని పాటిస్తూ క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా జరగాలని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వేగంగా నెరవేరుస్తోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే ప్రధాన నినాదంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి స్థానిక ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదం పొందాలని నేతలకు మార్గదర్శనం చేశారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి, పొత్తుల వల్ల టికెట్లు దక్కని ఆశావహులకు రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. స్వార్థ ప్రయోజనాలు పక్కనపెట్టి, ప్రజాదరణ ఉన్న మంచి అభ్యర్థులనే ఎంపిక చేసి విజయానికి కృషి చేయాలని ఆదేశించారు.




