Chandrababu: రప్పారప్పా అంటూ వేధిస్తే తాట తీయాల్సిందే.. పోలీసు అమరవీరుల దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

Chandrababu: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

Arun Chilukuri
Published on: 21 Oct 2026 11:18 AM IST
Chandrababu
X

Chandrababu: రప్పారప్పా అంటూ వేధిస్తే తాట తీయాల్సిందే.. పోలీసు అమరవీరుల దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

Chandrababu: దేశ రక్షణకు భంగం కలిగే చర్యలను ఏపీ పోలీసు వ్యవస్థ పటిష్టంగా అడ్డుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై నమ్మకం ఉంటేనే విదేశీ పెట్టుబడులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 'పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం' కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సమాజంలో ప్రశాంత వాతావరణం నిలవాలన్నా, అభివృద్ధి సాధ్యపడాలన్నా పోలీసు వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. "నేను ఎప్పుడు అధికారంలో ఉన్నా శాంతిభద్రతల పరిరక్షణకే నా మొదటి ప్రాధాన్యత ఇస్తాను. రాజకీయం ముసుగులో నేరాలకు పాల్పడే రాజకీయ నేరస్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ కల్పించకూడదు. 'రప్పారప్పా' అంటూ ప్రజలను, మహిళలను భయభ్రాంతులకు గురిచేసే వారి తాట తీయాల్సిందే. అలాగే సోషల్ మీడియా వేదికగా వికృత చేష్టలకు పాల్పడే 'సోషల్ మీడియా సైకోలను' కూడా వదిలిపెట్టవద్దు" అని పోలీసులకు తేల్చి చెప్పారు.

సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంలో ఏపీ పోలీసులు ఎప్పుడూ ముందంజలో ఉంటారని గుర్తుచేసిన ఆయన.. "ఏపీ పోలీసులంటే టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే టాప్‌ అని ప్రతిఒక్కరూ చెప్పుకునేలా పనితీరు ఉండాలి" అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్‌, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.