Palnadu: నామినేషన్లు అడ్డుకుని ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని విమర్శ!

Palnadu: వినుకొండ నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 28 Nov 2026 1:14 PM IST
Palnadu
X

Palnadu: నామినేషన్లు అడ్డుకుని ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని విమర్శ!

Palnadu: వినుకొండ నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి నేతలు, పోలీసులు కుమ్మక్కై కొన్ని గ్రామాల్లో వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, మరికొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. కూటమి అభ్యర్థులు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచామని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారు.

బొల్లాపల్లి మండలం వెల్లటూరులో ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారని, పోలింగ్ సమయంలో బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లారని ఆరోపించారు. కొండ్రముట్లతో పాటు కొప్పుకొండ, అందుగులపాడు, శివాపురం, చీకటేగలపాలెం, ఐనవోలు గ్రామాల్లోనూ దౌర్జన్యాలు జరిగాయని పేర్కొన్నారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కౌంటింగ్ సమయంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. మొత్తం 119 గ్రామ పంచాయతీల్లో 24 చోట్ల వైసీపీ మద్దతుదారులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించారని తెలిపారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA