Road Accident: 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు.. అయినా లేచి బైక్‌పై వెళ్లిపోయాడు!

Road Accident: తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరం వద్ద రెండు కార్లు బైకును ఢీకొట్టగా యువకుడు గాల్లో ఎగిరిపడ్డారు.

Arun Chilukuri
Published on: 26 Nov 2026 11:04 AM IST
Road Accident
X

Road Accident: 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు.. అయినా లేచి బైక్‌పై వెళ్లిపోయాడు!

Road Accident: బైకుపై వెళ్తున్న వ్యక్తిని ఒకదాని తర్వాత ఒకటి రెండు కార్లు బలంగా ఢీకొట్టాయి. ఆ ధాటికి ఆయన గాల్లో పల్టీలు కొట్టి దూరంగా ఎగిరిపడ్డారు. ప్రమాదం జరిగిన తీరు చూసి ప్రాణాలతో బయటపడటం కష్టమని స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన స్వల్ప గాయాలతో లేచి, తన బైకును తీసుకుని అక్కడి నుంచి వెళ్లడం అందరినీ విస్మయానికి గురిచేసింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదానికి గురైన వ్యక్తి పేరు సాలిక నవీన్. ఆయన స్వగ్రామం సామర్లకోట కాగా, పెదరాయవరంలోని అత్తగారి ఇంట్లో ఉంటూ.. కాకినాడ జిల్లా పెద్దాపురం సమీపంలోని రొయ్యల మేత తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారు.

బుధవారం అనారోగ్యానికి గురైన నవీన్, కంపెనీ నుంచి సెలవు పెట్టి బైకుపై ఇంటికి బయలుదేరారు. పెదరాయవరం సమీపంలోని ఏడీబీ (ADB) రోడ్డుపై అకస్మాత్తుగా మలుపు తిరిగారు. అదే సమయంలో వచ్చిన రెండు కార్లు ఒకదాని తర్వాత మరొకటి నవీన్ బైకును ఢీకొట్టాయి.

ఈ ప్రమాదంలో నవీన్ గాల్లో పల్టీలు కొట్టి సుమారు 100 మీటర్ల దూరంలో పడ్డారు. సమీపంలోని పెట్రోల్ బంకు సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రమాద తీవ్రతను చూసి నవీన్‌కు తీవ్ర గాయాలై ఉంటాయని చుట్టుపక్కల వారు భావించి, ఆయన చుట్టూ చేరారు. అయితే, అనూహ్యంగా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా స్వల్ప గాయాలతో ఆయన లేచి, తన బైకు తీసుకుని వెళ్లడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో నవీన్‌ను 'మృత్యుంజయుడు' అంటూ పలువురు అభినందిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.