Badvel: మున్సిపల్ నామినేషన్ల దాఖలులో ఘర్షణ.. పోలీసులకు ఫిర్యాదు!

Badvel: బద్వేలు మున్సిపల్ నామినేషన్ల సమయంలో కార్యాలయంపై దాడి, నామినేషన్ పత్రాల ధ్వంసంపై కమిషనర్ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు. వైఎస్సార్‌సీపీ, ప్రజాసంఘాల ఆగ్రహం.

B. ARUN KUMAR, BADVEL
Published on: 24 Oct 2026 11:23 PM IST
Badvel
X

Badvel: మున్సిపల్ నామినేషన్ల దాఖలులో ఘర్షణ.. పోలీసులకు ఫిర్యాదు!

బద్వేలు: నామినేషన్ల సమయంలో వందమంది అల్లరి మూకలు మున్సిపల్ కార్యాలయంలోకి చోరబడి నామినేషన్ పత్రాలను చించివేశారు అంటూ బద్వేల్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన బద్వేల్ పట్టణ ఎన్నికల సహాయ అధికారి & కమిషనర్ కృష్ణ..

ఇదే సమయంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఎన్నికల అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి నామినేషన్ పత్రాలను చించివేసిన వార్డులలో ఏకగ్రీవం ఎలా చేస్తారంటూ..? అధికార పార్టీకి తలవొగ్గి అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి ఏకగ్రీవాలు అక్రమంగా ఎలా చేస్తారు అంటూ బద్వేల్ ఎన్నికల అధికారులపై ఫిర్యాదు చేసిన బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

బద్వేలు మున్సిపాలిటీకి నిర్వహించిన రెండవ సాధారణ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ సందర్భంగా, 17.10.2026 తేదీన సుమారు మధ్యాహ్నం 3:10 గంటల సమయంలో, 100 మందికి పైగా గుర్తుతెలియని వ్యక్తులు గుమిగూడి బలవంతంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి కార్యాలయంపై దాడి చేసినట్లు ఆ గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయ తలుపులు, కంప్యూటర్లు, అల్మారాలు మరియు ఇతర కార్యాలయ పరికరాలతో సహా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.

అంతేకాకుండా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ఎన్నికల సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు.ఈ ఘటన కారణంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లడంతో పాటు, మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అదేవిధంగా, కౌంటర్ నంబర్లు 4, 6, 8 వద్ద స్వీకరించిన నామినేషన్ ఫారాలు మరియు చైర్‌పర్సన్ నామినేషన్ స్వీకరణ గదిలోని నామినేషన్ ఫారాలను కూడా దుండగులు బలవంతంగా చింపివేసి, ధ్వంసం చేశారు. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ మరియు ఎన్నికలకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు సజావుగా కొనసాగడానికి ఆటంకం ఏర్పడింది.

అందువల్ల, బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు చేపట్టి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాను.

అంటూ బద్వేల్ మున్సిపల్ కార్యాలయం నుండి ఓ ఫిర్యాదు బద్వేల్ అర్బన్ పోలీసులకు సమర్పించడంతో అసలు బద్వేల్ పట్టణంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల విషయం ఎన్నో అనుమానాలకు తావు యిచ్చేలాగున ఉందని ప్రజా సంఘాలు, వైయస్సార్ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

నామినేషన్లు జరిగి కొన్ని రోజులు గడచిన తర్వాత అధికారులు ఇలాంటి ప్రకటనలు, ఫిర్యాదులు చేయటం లో ఆంతర్యం ఏంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బద్వేల్ లో ఎన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీల మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల విషయం రాష్ట్రంలో దుమారం రేపటం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL