Chintoor: చింతూరు సబ్ కలెక్టర్‌ను కలిసి సత్కరించిన జర్నలిస్టుల బృందం!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు సబ్ కలెక్టర్ నరేంద్ర పడాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల బృందం.

RAJESH REDDY, CHINTOOR
Published on: 8 Oct 2026 12:58 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు సబ్ కలెక్టర్‌ను కలిసి సత్కరించిన జర్నలిస్టుల బృందం!

Chintoor: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) నాయకులు చింతూరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిట్టపులి నరేంద్ర పడాల్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పోలవరం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, డివిజన్ అధ్యక్షులు షౌకత్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు కలసి సాలువాతో సత్కరించి పూల మొక్క, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి జ్ఞాపికను అందజేశారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఐటీడీఏ ద్వారా జరుగుతున్న సంక్షేమ పథకాలు,స్థానిక సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్రను వివరించారు.

చింతూరు ఏజెన్సీలో ప్రధానంగా వైద్యం విద్య శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సబ్ కలెక్టర్ నరేంద్ర పడాల్ అన్నారు.ఈ కార్యక్రమంలో APUWJ నాయకులు సత్యనారాయణ (ఆంధ్రజ్యోతి),రాజేష్ రెడ్డి( హెచ్ఎంటీవీ), శ్రీనివాస్( టీవీ9),జీవన్( మ హా న్యూస్), రియాజ్ (ఐ న్యూస్ ),ఈశ్వర చారీ( ప్రైమ్ 9), ఆసీఫ్( ఆంధ్ర పత్రిక ) సతీష్( పెన్ పవర్) రామారావు( మన వార్త), రాజు( ప్రజా జ్యోతి ) తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR