School Holiday: ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 29న ఏపీలో ఆ జిల్లాల విద్యాసంస్థలకు సెలవు

School Holiday: ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ 29న విశాఖ, రాజమహేంద్రవరం, ఏలూరులో సెలవు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Oct 2026 10:29 PM IST
School Holiday
X

School Holiday: ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 29న ఏపీలో ఆ జిల్లాల విద్యాసంస్థలకు సెలవు

School Holiday: 'అర్నాబ్' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 29 (గురువారం) నాడు విశాఖపట్నం, రాజమహేంద్రవరం మరియు ఏలూరు జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖపట్నంలో రెండవ రోజు కూడా సెలవు:

ఆర్నాబ్ తుపాను ప్రభావం కొనసాగుతుండటంతో విశాఖపట్నం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ ప్రకటించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా బుధవారం రాత్రి 9:00 గంటల నుంచి గురువారం ఉదయం 8:00 గంటల వరకు విశాఖ నగర పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు.

రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ వర్సిటీకి సెలవు:

రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో పాటు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు కూడా సెలవు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏలూరు జిల్లాలోనూ బంద్:

వర్షాల ధాటికి ఏలూరు జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. పాఠశాలలకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్