Pension Rules: ఏపీలో పింఛన్ల పంపిణీకి కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి మారనున్న విధానం

Pension Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛనుదారులకు ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ విధానంలో

G Krishna
Published on: 6 Oct 2026 7:32 PM IST
Pension Rules
X

Pension Rules: ఏపీలో పింఛన్ల పంపిణీకి కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి మారనున్న విధానం

Pension Rules: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛనుదారులకు ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు లబ్ధిదారులకు పూర్తి నగదును నేరుగా చేతికే అందిస్తుండగా, ఇకపై ఈ విధానాన్ని రెండు భాగాలుగా విభజించనున్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ వాటాను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించారు.

చేతికి ఎంత? బ్యాంక్ ఖాతాలో ఎంత?

కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రధాన వాటాను నగదు రూపంలో లబ్ధిదారుల చేతికి ఇస్తారు. కేంద్ర వాటా మాత్రం నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోనే డిపాజిట్ అవుతుంది. ఉదాహరణకు, వృద్ధులకు లభించే రూ. 4,000 పింఛనులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ. 3,800 నగదు రూపంలో లబ్ధిదారుడి చేతికి అందుతుంది, కాగా కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఇచ్చే రూ. 200 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. అదేవిధంగా దివ్యాంగులకు అందించే రూ. 6,000 పింఛనులో రాష్ట్ర వాటా రూ. 5,700 చేతికి ఇస్తుండగా, కేంద్ర వాటా రూ. 300 బ్యాంక్ ఖాతాలో జమ కానుంది.

ఖాతాకు ఆధార్‌ లింక్ తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం అందించే వాటా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పడాలంటే ఆధార్‌‌-బ్యాంక్ అకౌంట్ సీడింగ్ తప్పనిసరిగా పూర్తి కావాల్సి ఉంటుంది. ఆధార్ లింక్ లేని పక్షంలో కేంద్ర వాటా పింఛను సొమ్ము నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పింఛనుదారులు వెంటనే తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ అనుసంధానమై ఉందో లేదో సరిచూసుకోవాలని, ఒకవేళ లింక్ కాకపోతే తక్షణమే సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.