AP Municipal Elections: ఏపీ స్థానిక పోరులో ముగిసిన ప్రచారం

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. నవంబరు 1న పోలింగ్, 36,351 మంది పోలీసులతో భారీ భద్రత. నవంబరు 3న కౌంటింగ్.

Arun Chilukuri
Published on: 30 Oct 2026 5:30 PM IST
AP Municipal Elections
X

AP Municipal Elections: ఏపీ స్థానిక పోరులో ముగిసిన ప్రచారం

AP Municipal Elections Campaign Ends: ఆంధ్రప్రదేశ్‌లోని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు మరియు నగరపాలక సంస్థల (కార్పొరేషన్లు) ఎన్నికల సంగామంలో అత్యంత కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థుల హోరాహోరీ ప్రచారంతో హోరెత్తిన స్థానిక సమరం ప్రచార పర్వానికి ఇవాళ సాయంత్రం 5 గంటలతో అధికారికంగా తెరపడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం నవంబరు 1న పోలింగ్ జరగనుండటంతో, ఓటింగ్ సమయానికి 48 గంటల ముందే మైకులు, లౌడ్‌స్పీకర్ల హోరు, బహిరంగ సభలు మరియు ర్యాలీలు, ఊరేగింపులను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా నిషేధించింది.

పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో, నిష్పాక్షికంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 36,351 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును మోహరిస్తోంది. సమస్యాత్మక మరియు అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు పోలీసు బలగాలతో పాటు డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీలు, ప్రత్యేక వీడియోగ్రాఫర్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగించేలా చర్యలు చేపట్టారు. నవంబర్ 1న జరగనున్న ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం, నవంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.