AP Local Body Elections 2026: పవన్ కల్యాణ్‌తో కూటమి నేతల భేటీ: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు!

AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ వివరాలు.

Arun Chilukuri
Published on: 13 Oct 2026 5:38 PM IST
AP Local Body Elections 2026
X

AP Local Body Elections 2026: పవన్ కల్యాణ్‌తో కూటమి నేతల భేటీ: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు!

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి అధికార కూటమి పార్టీలు కసరత్తును వేగవంతం చేశాయి. ఎన్నికల్లో పొత్తులో భాగంగా స్థానాల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే (TDP-Janasena-BJP) కూటమిలో కీలక చర్చలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సమావేశమయ్యారు.

మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నివాసంలో జరిగిన ఈ కీలక సమావేశంలో టీడీపీ, జనసేన అగ్రనేతలు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కీలక నేతలు వంశీ కృష్ణ, చిల్లపల్లి శ్రీనివాస్ తదితరులు.

సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ముఖ్యనేతల మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. ఏయే జిల్లాలు, నియోజకవర్గాల్లో ఏ పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలనే అంశంపై సీఎం చంద్రబాబు ప్రాథమిక మార్గదర్శకాలు ఖరారు చేశారు.

సీఎం చర్చల అనంతరం, తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమక్షంలో నేతలు సమావేశమై సీట్ల ప్రతిపాదనలు, క్షేత్రస్థాయి సమీకరణాలు, గెలుపు అవకాశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

స్థానిక సంస్థల్లో ఇరు పార్టీల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా సమన్వయంతో పోటీ చేసి విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.