AP Local Body Elections Schedule: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 3 దశల్లో ఎన్నికలు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!
AP Local Body Elections Schedule 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. అక్టోబర్ 28న మున్సిపల్ ఎన్నికలు, నవంబర్లో ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు.
AP Local Body Elections Schedule: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. 3 దశల్లో ఎన్నికలు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!
AP Local Body Elections Schedule 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ లోకల్ బాడీస్ (ULBs), ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే గ్రామ పంచాయతీలకు వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఈ షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నారు. 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18 వరకు గడువు ఇచ్చారు. 19న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఈ నెల 21వరకు గడువు ఉంది.
నవంబరు 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు తుదిగడువు ఈ నెల 23. ఉపసంహరణకు ఈ నెల 27వరకు గడువు ఉంది. నవంబరు 5న ఫలితాలు వెల్లడించనున్నారు.
పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు ఉంటుంది.




