AP Local Body Elections: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. ఏపీ స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై చర్చలు!
AP Local Body Elections: ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో సీట్ల సర్దుబాటుపై సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యవసరంగా భేటీ అయ్యారు.
AP Local Body Elections: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. ఏపీ స్థానిక ఎన్నికల సీట్ల సర్దుబాటుపై చర్చలు!
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు పంచాయితీ సచివాలయానికి, సీఎం నివాసానికి చేరింది. పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల కేటాయింపుపై స్పష్టత రాకపోవడం, నామినేషన్ల గడువు సమీపించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఉమ్మడి నామినేషన్ల గడువు నేటితోనే ముగుస్తుండటంతో సీఎం నివాసానికి చేరుకున్న పవన్ కల్యాణ్, చంద్రబాబుతో సుమారు అరగంట పాటు సుదీర్ఘంగా చర్చించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల (TDP-Janasena-BJP) తరఫున ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పలు చోట్ల కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. గెలుపు అవకాశాలున్న స్థానాల్లో మూడూ పార్టీల నేతలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆశావహులను సముదాయించడం, ఫ్రెండ్లీ కాంటెస్ట్లను నివారించి ఏకాభిప్రాయం సాధించడంపై ఇద్దరు నేతలు లోతుగా విశ్లేషించారు. నామినేషన్ల ఉపసంహరణ సమయానికి కూటమి అభ్యర్థులపై పూర్తి స్పష్టత వచ్చేలా అంతర్గత సమన్వయం సాధించాలని నిర్ణయించారు. కాగా, సీట్ల సర్దుబాటు వివాదాలను కొలిక్కి తెచ్చేందుకు గురువారం కూడా చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయిన విషయం విదితమే.




