AP Local Body Elections 2026: 8 స్థానాలు మహిళలకే: ఏపీ మేయర్ రిజర్వేషన్లలో మహిళలకు పెద్దపీట!

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది.

Arun Chilukuri
Published on: 12 Oct 2026 4:05 PM IST
AP Local Body Elections 2026
X

AP Local Body Elections 2026: 8 స్థానాలు మహిళలకే: ఏపీ మేయర్ రిజర్వేషన్లలో మహిళలకు పెద్దపీట!

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్‌ స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం స్థానాల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీకి 1 స్థానాన్ని కేటాయించగా.. జనరల్ మహిళలకు 5, అన్‌రిజర్వ్‌డ్‌ (జనరల్‌) కింద 4 స్థానాలను నిర్దేశించారు.

మేయర్‌ రిజర్వేషన్ల పూర్తి వివరాలు:

మంగళగిరి - తాడేపల్లి: ఎస్టీ

రాజమహేంద్రవరం: ఎస్సీ

కర్నూలు: ఎస్సీ

మచిలీపట్నం: బీసీ మహిళ

కాకినాడ: బీసీ మహిళ

ఏలూరు: బీసీ జనరల్‌

అనంతపురం: బీసీ జనరల్‌

చిత్తూరు: బీసీ జనరల్‌

విజయనగరం: జనరల్‌ మహిళ

శ్రీకాకుళం: జనరల్‌ మహిళ

గుంటూరు: జనరల్‌ మహిళ

కడప: జనరల్‌ మహిళ

విశాఖపట్నం: జనరల్‌ మహిళ

తిరుపతి: అన్‌రిజర్వ్‌డ్‌

విజయవాడ: అన్‌రిజర్వ్‌డ్‌

ఒంగోలు: అన్‌రిజర్వ్‌డ్‌

నెల్లూరు: అన్‌రిజర్వ్‌డ్‌

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.