Local Body Elections: ఏపీలో మోగనున్న స్థానిక ఎన్నికల భేరి.. నేడే షెడ్యూల్ విడుదల..!
Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఎస్ఈసీ విడుదల చేయనుంది.
Local Body Elections: ఏపీలో మోగనున్న స్థానిక ఎన్నికల భేరి.. నేడే షెడ్యూల్ విడుదల..!
Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా ఉత్కంఠ స్థాయికి చేరింది. గడప గడపనా ఎన్నికల వేడి రగిలిస్తూ, స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. ఈ రోజే ఉదయం 11:30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ షెడ్యూల్ వెలువడగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మరోవైపు ఎన్నికల వేడిని మరింత పెంచుతూ రాష్ట్రంలోని 28 జడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. సామాజిక సమీకరణాలు, మహిళా ప్రాతినిధ్యానికి పెద్దపీట వేస్తూ పంచాయతీరాజ్ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
విశాఖపట్నం: బీసీ
తిరుపతి: ఎస్సీ మహిళ
ఎన్టీఆర్ జిల్లా: ఎస్సీ
ప్రకాశం: ఎస్సీ
గుంటూరు: ఎస్సీ మహిళ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ: ఎస్సీ మహిళ
కృష్ణా జిల్లా: జనరల్ మహిళ
పల్నాడు: జనరల్ మహిళ
తూర్పు గోదావరి: జనరల్ మహిళ
నెల్లూరు: జనరల్
మున్సిపల్ పరిపాలన, నగరపాలక సంస్థలతో పాటు గాలితో పోటీపడుతూ ప్రాదేశఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ పోరుకూ కౌంట్డౌన్ ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికలు ఏక విడతలో, పంచాయతీ పోరు 3 దశల్లో నిర్వహించేలా ముమ్మర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. రిజర్వేషన్లు స్పష్టమవడంతో ప్రధాన రాజకీయ పక్షాలైన కూటమి, వైఎస్సార్సీపీలో అభ్యర్థుల వేట, టికెట్ల పంచాయతీ ఊపందుకుంది. ఉదయం 11:30 గంటలకు ఎన్నికల కమిషనర్ చేయనున్న ఆ సంచలన ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో, ఏ వీధిలో చూసినా ఎన్నికల సందడే కనిపించనుంది.




