AP Govt Holiday: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్న్యూస్.. అక్టోబర్ 19న సెలవు
AP Govt Holiday: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 19న మహర్నవమి సందర్భంగా సాధారణ సెలవు ప్రకటించింది.
AP Govt Holiday
AP Govt Holiday: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. రాబోయే అక్టోబర్ 19, 2026 తేదీన మహర్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవును ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జేసారు. సాధారణ పరిపాలన శాఖ రాజకీయ విభాగం నుంచి జీవో ఆర్టీ నంబర్ 2015 అక్టోబర్ 16వ తేదీన విడుదల చేయబడింది. పండగ సమయాల్లో కుటుంబంతో ఆనందంగా గడపాలనుకునే ఉద్యోగులకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది.
వాస్తవానికి ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన అధికారిక సాధారణ అలాగే ఐచ్ఛిక సెలవుల జాబితాలో అక్టోబర్ 19వ తేదీకి ఎలాంటి సెలవు కేటాయించలేదు. అయితే ఏపీ సచివాలయ సంఘం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది. ఉద్యోగుల అభ్యర్థనను పరిశీలించిన అనంతరం మహర్నవమి రోజున సాధారణ సెలవును ఖరారు చేసింది. అయితే ఈ సెలవు బదులుగా నవంబర్ 14వ తేదీ వచ్చే రెండో శనివారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ యథావిధిగా పనిచేయాలని స్పష్టం చేసింది. ఆ రోజును ప్రత్యామ్నాయ పని దినంగా ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సెలవు ప్రకటన విషయంలో ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిబంధనలను కూడా ఉంచింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో అలాగే ఎన్నికలకు సంబంధించిన వివిధ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న అధికారులు లేదా సిబ్బందికి ఈ సెలవు వర్తించదు. వీరంతా ఎలాంటి మినహాయింపులు లేకుండా యథావిధిగా తమకు కేటాయించిన విధులకు హాజరుకావాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలు అలాగే కార్యాలయాల అధిపతులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.




