AP Local Body Elections 2026: ఏపీ స్థానిక పోరుకు మార్గం సుగమం.. 8 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన కేబినెట్!

AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజీవ్ రంజన్ కమిషన్ ఆధారంగా 8 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది.

Arun Chilukuri
Published on: 10 Oct 2026 3:16 PM IST
AP Cabinet
X

AP Cabinet: ఏపీ స్థానిక పోరుకు మార్గం సుగమం.. 8 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన కేబినెట్!

AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అత్యంత ప్రాధాన్యత కలిగిన నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన సిఫారసులు, సమగ్ర నివేదిక ఆధారంగా మొత్తం 8 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్లను అధికారికంగా ఖరారు చేసింది.

కేబినెట్ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల శాతం వివరాలు:

1. గ్రామీణ స్థానిక సంస్థలు (Rural Local Bodies):

పంచాయతీ వార్డు మెంబర్లు: 26.73%

సర్పంచ్‌లు: 27.95%

ఎంపీటీసీలు (MPTC): 25.55%

ఎంపీపీలు (MPP): 24.60%

జడ్పీటీసీలు (ZPTC): 24.60%

జడ్పీ ఛైర్‌పర్సన్లు: 23.08%

2. పట్టణ స్థానిక సంస్థలు (Urban Local Bodies):

అర్బన్ వార్డు మెంబర్లు (మున్సిపల్/కార్పొరేషన్): 32.78%

మున్సిపల్ ఛైర్‌పర్సన్లు: 32.03%

మేయర్లు: 35.02%

న్యాయపరమైన చిక్కులు రాకుండా రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల మార్గదర్శకాలకు అనుగుణంగా రాజీవ్ రంజన్ కమిషన్ అందించిన డేటా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసినట్లు కేబినెట్ భేటీ అనంతరం కేబినెట్ మంత్రులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.