Annadata Sukhibhava: రైతన్నలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.6 వేలు జమ అయ్యే తేదీ వచ్చేసింది
Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతన్నలకు త్వరలో అదిరిపోయే శుభవార్త అందనుంది.
Annadata Sukhibhava
Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతన్నలకు త్వరలో అదిరిపోయే శుభవార్త అందనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ముందుగా అక్టోబర్ 17వ తేదీన ఈ డబ్బులు విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దీపావళి పండుగకు ముందే అక్టోబర్ 30వ తేదీన ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 లక్షల మందికి పైగా రైతులు ఈ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఒకేసారి ఖాతాల్లోకి రూ.6,000 జమ
ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహాయం కలిపి ఒకేసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కలిపి మొత్తం రూ.6 వేలు రైతుల అకౌంట్లో పడతాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 20వ తేదీన తొలి విడత డబ్బులు విడుదల చేయగా, ఇప్పుడు రెండో విడత నిధులను అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
కౌలు రైతులకు కూడా వర్తింపు
ఈ సహాయం కేవలం స్వంత భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా భూమి లేని కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. కాకపోతే కౌలు రైతులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సీసీఆర్సీ (క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్) పొందాల్సి ఉంటుంది. ఈ కార్డు ఉన్న కౌలు రైతులు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంది. కార్డు లేనివారు వెంటనే భూయజమానితో మాట్లాడి దాన్ని పొందాలని ప్రభుత్వం సూచించింది.
స్టెటస్ చెక్ చేసుకోవడం
రైతులు తమ డబ్బులు జమ అయ్యేది లేనిది ఆన్లైన్లో సులభంగా తెలుసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి నో యువర్ స్టేటస్ ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వివరాలు చూడవచ్చు. అలాగే పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ నంబర్ తో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే నిధులు ఎలాంటి అంతరాయం లేకుండా ఖాతాల్లో పడాలంటే రైతులు తమ బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ లింక్ చేసుకుని, ఈ-కేవైసీ పూర్తి అయ్యిందో లేదో సరిచూసుకోవడం చాలా ముఖ్యం.




