AP Panchayat Elections 2026: ఏపీలో మోగిన పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల..!

AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 13 Nov 2026 12:26 PM IST
AP Panchayat Elections 2026
X

AP Panchayat Elections 2026: ఏపీలో మోగిన పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల..!

AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, తొలి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

తొలి విడత పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఇదే:

ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.

నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఈ నెల 26న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు (నవంబర్ 26) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

ఒకవేళ ఎక్కడైనా అనివార్య కారణాలతో రీపోలింగ్‌ అవసరమైతే, ఈ నెల 27న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.