Chintoor: ఏడుగురాళ్లపల్లిలో ఓటర్లను కలిసిన టీడీపీ, జనసేన నేతలు!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి బత్తుల నాగమణి, జడ్పీటీసీ అభ్యర్థి తీగల కవితకు మద్దతుగా ఇంటింటి ప్రచారం.

RAJESH REDDY, CHINTOOR
Published on: 29 Oct 2026 12:35 PM IST
Chintoor
X

Chintoor: ఏడుగురాళ్లపల్లిలో ఓటర్లను కలిసిన టీడీపీ, జనసేన నేతలు!

Chintoor: ఏడుగురాళ్లపల్లి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఎంపీటీసీ అభ్యర్థి బత్తుల నాగమణి, జడ్పీటీసీ అభ్యర్థి తీగల కవిత గెలుపు కోసం మాజీ మండల అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి, సీనియర్ నాయకుడు సయ్యద్ ఆసిఫ్ నాయకత్వంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు తురం తమ్మయ్య, జనసేన నాయకులు ఎడం పవన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR