Kunavaram: మాజీ ఎంపీపీ, అనుభవజ్ఞుడు పాయం వెంకయ్యను గెలిపించండి!
Kunavaram: పోలవరం జిల్లా కూనవరం జడ్పీటీసీ కూటమి బీజేపీ అభ్యర్థి పాయం వెంకయ్య తరఫున ప్రచారం. బిజెపి ఇంచార్జ్ రమణారెడ్డి (చిట్టిబాబు) నేతృత్వంలో మండల అభివృద్ధి లక్ష్యంగా ఓట్ల అభ్యర్థన.
Kunavaram: మాజీ ఎంపీపీ, అనుభవజ్ఞుడు పాయం వెంకయ్యను గెలిపించండి!
Kunavaram: కూనవరం జడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి తరఫున బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పాయం వెంకయ్య గెలుపు కోసం కూటమి నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. కూనవరం బిజెపి ఇంచార్జ్ రమణారెడ్డి(చిట్టిబాబు) వెంకయ్య గెలుపు కోసం ఓ ప్రణాళిక బద్ధంగా ముందుకు దూసుకుపోతున్నారు.
వెంకయ్య రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న నాయకుడు, గతంలో కూనవరం ఎంపీపీగా పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేశారు.పోలవరం నిర్వాసితుల సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తిగా గుర్తింపు ఉంది
.తనను గెలిపిస్తే కూనవరం మండలంలోని అంతర్గత రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇచ్చారు.మండలంలోని డ్రైనేజీ సమస్య, మంచినీటి కొరత, పారిశుధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని తెలిపారు.అనుభవం ఉన్న నాయకుడు పాయం వెంకయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూటమి నాయకులు ఓటర్లను కోరుతున్నారు.




