Markapur: మార్కాపురంలో హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌పై అవగాహనకు 5కే మారథాన్!

Markapur: మార్కాపురంలో హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5కే మారథాన్‌ను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 23 Sept 2026 12:37 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌పై అవగాహనకు 5కే మారథాన్!

Markapur: హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మార్కాపురంలో 5కే మారథాన్ నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమాన్ని కోర్టు సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించారు.హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడంతో పాటు, వ్యాధి నివారణ చర్యలపై ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి అండగా నిలవాలని సూచించారు.

ఈ మారథాన్‌లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొని హెచ్‌ఐవీ–ఎయిడ్స్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాహుల్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM